మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Gayatri Ashtakam 1 – శ్రీ గాయత్రీ అష్టకం – 1
విశ్వామిత్రతపఃఫలాం ప్రియతరాం విప్రాలిసంసేవితాం
నిత్యానిత్యవివేకదాం స్మితముఖీం ఖండేందుభూషోజ్జ్వలామ్ |
తాంబూలారుణభాసమానవదనాం మార్తాండమధ్యస్థితాం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || 1 ||
జాతీపంకజకేతకీకువలయైః సంపూజితాంఘ్రిద్వయాం
తత్త్వార్థాత్మికవర్ణపంక్తిసహితాం తత్త్వార్థబుద్ధిప్రదామ్ |
ప్రాణాయామపరాయణైర్బుధజనైః సంసేవ్యమానాం శివాం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || 2 ||
మంజీరధ్వనిభిః సమస్తజగతాం మంజుత్వసంవర్ధనీం
విప్రప్రేంఖితవారివారితమహారక్షోగణాం మృణ్మయీమ్ |
జప్తుః పాపహరాం జపాసుమనిభాం హంసేన సంశోభితాం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || 3 ||
కాంచీచేలవిభూషితాం శివమయీం మాలార్ధమాలాదికా-
-న్బిభ్రాణాం పరమేశ్వరీం శరణదాం మోహాంధబుద్ధిచ్ఛిదామ్ |
భూరాదిత్రిపురాం త్రిలోకజననీమధ్యాత్మశాఖానుతాం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || 4 ||
ధ్యాతుర్గర్భకృశానుతాపహరణాం సామాత్మికాం సామగాం
సాయంకాలసుసేవితాం స్వరమయీం దూర్వాదలశ్యామలామ్ |
మాతుర్దాస్యవిలోచనైకమతిమత్ఖేటీంద్రసంరాజితాం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || 5 ||
సంధ్యారాగవిచిత్రవస్త్రవిలసద్విప్రోత్తమైః సేవితాం
తారాహారసుమాలికాం సువిలసద్రత్నేందుకుంభాంతరామ్ |
రాకాచంద్రముఖీం రమాపతినుతాం శంఖాదిభాస్వత్కరాం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || 6 ||
వేణీభూషితమాలకధ్వనికరైర్భృంగైః సదా శోభితాం
తత్త్వజ్ఞానరసాయనజ్ఞరసనాసౌధభ్రమద్భ్రామరీమ్ |
నాసాలంకృతమౌక్తికేందుకిరణైః సాయంతమశ్ఛేదినీం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || 7 ||
పాదాబ్జాంతరరేణుకుంకుమలసత్ఫాలద్యురామావృతాం
రంభానాట్యవిలోకనైకరసికాం వేదాంతబుద్ధిప్రదామ్ |
వీణావేణుమృదంగకాహలరవాన్ దేవైః కృతాంఛృణ్వతీం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || 8 ||
హత్యాపానసువర్ణతస్కరమహాగుర్వంగనాసంగమా-
-న్దోషాంఛైలసమాన్ పురందరసమాః సంచ్ఛిద్య సూర్యోపమాః |
గాయత్రీం శ్రుతిమాతురేకమనసా సంధ్యాసు యే భూసురా
జప్త్వా యాంతి పరాం గతిం మనుమిమం దేవ్యాః పరం వైదికాః || 9 ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం శ్రీ గాయత్ర్యష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.